వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిర్మాత నట్టి కుమార్ వర్మపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు రూ. 5 కోట్లు వర్మ చెల్లించాల్సి ఉందని, వాటిని ఇవ్వమని అడగగా వర్మ పట్టించుకోవడం లేదని, అందుకే తమ డబ్బులు చెల్లించేవరకు ఆర్జీవీ తీసిన సినిమా మా ఇష్టం విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టు లో కేసు వేశాడు. ఇక దీంతో కోర్టు మా ఇష్టం సినిమా విడుదల కాకుండా స్టే విధించింది. ఇక వర్మ గురించి నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ” రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడు.. నాకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలి.. ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ అవ్వడు. రామ్ గోపాల్ వర్మ తో 20 సంవత్సరాలు కలిసి పని చేశాను.. సినిమా తీస్తాడు డబుల్ అగ్రీమెంట్ వేరే వాళ్లకు చేస్తాడు. ఇలా నన్ను ఒక్కడినే కాదు చాలామందిని మోసం చేశాడు.
రేపు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న డేంజర్ సినిమా ఆపివేస్తూ సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. నేడు వర్మ పుట్టినరోజు కాబట్టి సినిమా విడుదల కాకుండా మంచి గిఫ్ట్ ఇచ్చాను. రేపు డేంజర్ సినిమా ఆగిపోయినట్లే. కొంతమంది బ్రోకర్ల వలన రామ్ గోపాల్ వర్మ తన ప్రతిష్టను దిగజరుచుకుంటున్నాడు.. వాడి బండారం మొత్తం సాయంత్రం 5 గంటలకు బయటపెడతాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు ఈ విషయమై వర్మ స్పానిదించకపోవడం విశేషం. మరి వర్మ గురించి పచ్చి నిజాలు ఏమై ఉంటాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.