Guntur Kaaram: ఒక్క స్టిక్కర్ తో అందరి నోర్లకి తాళం వేసాడు… ఇది చాలా ఇంకా కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. మే 31న మాస్ స్ట్రైక్ గ్లిమ్ప్స్ తో ఘట్టమనేని అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చారు. మహేష్ బాబుని మాస్ గా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సస్ అయ్యాడు. 2024 జనవరి రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. శహోటింగ్ ఆగిపోయింది, సినిమా ఆగిపోతుంది, కథని మారుస్తున్నారు, థమన్ ని తీసేసారు, మహేష్ అండ్ త్రివిక్రమ్ కి పడట్లేదు, పూజ హెగ్డేని చేంజ్ చేసి ఇంకో హీరోయిన్ ని ఫైనల్ చేసారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు షెడ్యూల్ బ్రేక్ వచ్చిన ప్రతిసారి గుంటూరు కారం సినిమా గురించి సోషల్ మీడియాలో ఎదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి మేకర్స్ కాస్త స్లోగానే గుంటూరు కారం సినిమా పనులు చేస్తున్నట్లు ఉన్నారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన సినిమాకి, దానికి తగ్గట్లు షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటారు. అంతేకాని సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో పోస్టులు పెడుతూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్లేస్ లోకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు అనే వార్తలపై థమన్ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తూనే ఉన్నా… రూమర్స్ మాత్రం ఆగట్లేదు. లేటెస్ట్ గా పూజా హెగ్డే ప్లేస్ లోకి ఇంకో హీరోయిన్ వస్తుంది అనే వార్త కూడా వైరల్ అవుతుంది. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. గుంటూరు కారం ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయం అందరిలో ఉంది. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేలా, అందరి నోర్లకి తాళం వేసేలా ఒక్క ట్వీట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం… ఈ నెల 24 నుంచి షూటింగ్.. జనవరి 13న రిలీజ్… ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్…” అని ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కి నాగ వంశీ రిప్లై ఇస్తూ థంబ్స్ అప్ స్టికర్ పోస్ట్ చేసాడు. నిజానికి ఇది ఒక చిన్న ట్వీట్ ఏ అయినా నాగ వంశీ చాలా రూమర్స్ చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇక్కడితో అయినా గుంటూరు కారం సినిమాపై వినిపించే రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.
Also Read
- David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
👍
— Naga Vamsi (@vamsi84) June 20, 2023
తాజావార్తలు
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!