Priyanka Mohan: కెప్టెన్ మిల్లర్ అయ్యింది.. ఇక OG లో అడుగుపెట్టు పాప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది. అవకాశాలు అయితే వచ్చాయి గాని విజయాన్ని మాత్రం ప్రియాంక అందుకోలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియాంక.. ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన OG లో నటిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు ప్రియాంక కెరీర్ ను డిసైడ్ చేస్తాయని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోల సరసన నటిస్తుండడంతో ఇండస్ట్రీలో ప్రియాంక పేరు మారుమ్రోగిపోతుంది.
Saindhav: ఏందయ్యా ఈ క్యాస్టింగ్.. జనాలను చంపేస్తావా.. ?
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
ఇక తాజాగా ప్రియాంక కెప్టెన్ మిల్లర్ షూటింగ్ ను పూర్తి చేసింది. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక గ్రామీణ యువతిగా ప్రియాంక కనిపించనుంది. తన షూటింగ్ అయిపోవడంతో ప్రియాంక ఒక ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. డైరెక్టర్ అరుణ్ కు గన్ గురిపెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక దీంతో పవన్ అభిమానులు కెప్టెన్ మిల్లర్ ను పూర్తి చేశావు కదా.. ఇక OGలో అడుగు పెట్టు పాప అంటూ కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో కెప్టెన్ మిల్లర్.. తెలుగులో OG కనుక హిట్ టాక్ తెచ్చుకున్నాయి అంటే ఇండస్ట్రీలో ప్రియాంక రేంజ్ వేరే లెవల్ కు మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాలు ఈ అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!