Site icon NTV Telugu

Priyanka Jawalkar: పవన్ కళ్యాణ్‌తో చచ్చినా చేయను.. ప్రియాంకా బాంబ్

Priyanka On Pawan Kalyan

Priyanka On Pawan Kalyan

Priyanka Jawalkar Says That She Dont Want To Work With Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో నటించే ఆఫర్ వస్తే.. ఎవ్వరైనా వదులుకుంటారా? స్టార్ భామలు సైతం ఎగిరి గెంతులేస్తారు. ఆయనతో కలిసి వెండితెర పంచుకునే అవకాశం వచ్చిందని, డేట్స్ సర్దుబాటు చేస్తారు. అలాంటిది.. తనకు ఛాన్స్ వస్తే మాత్రం చచ్చినా చేయనంటూ యంగ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ బాంబ్ పేల్చింది. అయితే.. ఇందుకు ఓ బలమైన కారణం ఉందని ఈ అమ్మడు చెబుతోంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని, ఆయనంటే పడి చస్తానని తెలిపింది. పవన్ ‘తమ్ముడు’ సినిమాను తాను 20 సార్లు చూశానని.. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ గుర్తుందని పేర్కొంది. తాను పవన్‌కి వీరాభిమానినని.. దూరం నుంచి చూస్తూ అభిమానిగానే ఉండిపోవాలని ఉందని చెప్పింది. అంతకుమించి తానేం కోరుకోవడం లేదని.. ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చినా చేయనని వెల్లడించింది. పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కావట్లేదని చెప్పింది.

California Storm: తుఫాన్ బీభత్సం.. కాలిఫోర్నియా అతలాకుతలం.. 19 మంది మృతి

కాగా.. అనంతపురంకి చెందిన ప్రియాంకా, తొలుత షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ పుణ్యమా అని.. ‘ట్యాక్సీవాలా’ సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందడంతో.. ఇక ఈ బ్యూటీకి తిరుగు ఉండదని అంతా భావించారు. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అరకొర సినిమాలు చేసుకుంటూ.. తన కెరీర్‌ని నెట్టుకొస్తుంది. ఇలాంటి సమయంలో ఎవ్వరైనా.. స్టార్లతో ఒక సినిమా చేసి, స్టార్డమ్ పొందాలని అనుకుంటారు. కానీ.. ప్రియాంకా మాత్రం విచిత్రంగా పవన్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెప్పడం విడ్డూరం.

Pet Dog Tax: మీరు కుక్కలు పెంచుతున్నారా..? అయితే ఈ పన్నులు కట్టాల్సిందే..!

Exit mobile version