Priyanka Jawalkar: హ్యాపీ బర్త్ డే ప్రియాంక జవాల్కర్
- 'కల వర మాయే' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ
- ఆ వెంటనే విజయ్ దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రంలో ఆఫర్
- బర్తడే సందర్భంగా కూడా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులకు ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా తెలుగు సినిమాల్లోకి తెలుగు పూర్తిగా తెలిసిన అమ్మాయిలు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.. చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే అలా వచ్చి నిలదొక్కుకో గలుగుతారు. అలా వచ్చిన వారిలో ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఈ భామ.. తనదైన రీతిలో మెప్పించింది కానీ, ఏది పడితే అది చేస్తూ బిజీగా ఉండాలి అనుకోకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే సందర్బంగా ఒక స్టోరీ చూసేద్దం పదండి.
ప్రియాంక జవాల్కర్ అనంతపురంలో సెటిల్ అయిన ఓ మరాఠి ఫ్యామిలీలో పుట్టింది. చిన్నప్పటి నుంచీ నటన మీద ఆసక్తి ఏర్పరచుకున్న ఆమె టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా తనదైన అందంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఓ రేంజ్‌లో ఆకట్టుకోవడంతో ఆమెకు చదువుకునే రోజుల్లోనే సినిమా ఆఫర్లు పోటెత్తాయి. ఈ క్రమంలోనే ప్రియాంక 2017లో వచ్చిన ‘కల వర మాయే’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. జవాల్కర్‌కు ఆ వెంటనే విజయ్ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రంలో ఆఫర్ లభించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఈ మూవీలో ప్రియాంక తనదైన అందం, అభినయంతో రాణించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. అలాగే అప్పుడే చాలా మంది కుర్రాళ్ళ క్రష్ లిస్టులోనూ చేరిపోయింది. ఐతే ట్యాక్సీవాలా తర్వాత ప్రియాంక జవాల్కర్‌కు ఆఫర్లు ఆశించిన రీతిలో రాలేదు. ఈ పరిస్థితుల్లో సత్యదేవ్‌తో కలిసి ‘తిమ్మరుసు’ అనే చిత్రం చేసింది. దీని తర్వాత కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ మూవీలో కూడా నటించగా ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ అమ్మడు ‘గమనం’ అనే సినిమాలో మాత్రమే చేసింది.
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే దానికంటే ముందే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ప్రియాంక జవాల్కర్.. సోషల్ మీడియాలో ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది. తన సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చేయని ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ అందాల ఆరబోతకు సై అంటోంది. ఇక బర్తడే సందర్భంగా కూడా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. అవేమిటో మీరు. చూసేయండి మరి.

తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!