Site icon NTV Telugu

Varanasi : వారణాసికి డబ్బింగ్ చెప్పడంపై ప్రియాంక చోప్రా క్లారిటీ

Priyanka

Priyanka

Varanasi : భారీ అంచనాలను రేకెత్తిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రియాంకా చోప్రా ఇండియాలోకి తిరిగి వచ్చి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఇప్పటికే పెద్ద క్రేజ్ ఉంది. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్‌ను స్వయంగా ప్రియాంకానే వెల్లడించడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆమెను “వారణాసి సినిమాలో మీ పాత్రకు తెలుగులో మీరే డబ్బింగ్ చెబుతున్నారా” అని ప్రశ్నించాడు.

Read Also : Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?

దీనికి ప్రియాంకా ఇచ్చిన సమాధానం అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాను తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెబుతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంటున్నానని వెల్లడించింది. హాలీవుడ్, బాలీవుడ్‌ల మధ్య తన కెరీర్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ, మరోవైపు కొత్త భాష నేర్చుకోవడం ఏ నటికి అయినా పెద్ద పని. అయితే ప్రియాంకా చోప్రా మాత్రం తన పాత్ర కోసం ఇంత కష్టపడటం చూసి అందరూ వావ్ అంటున్నారు. చిన్న హీరోయిన్లు కూడా తెలుగులో మాట్లాడట్లేదు గానీ.. ప్రియాంక తెలుగు నేర్చుకుని చెప్పడాన్ని ప్రశంసిస్తున్నారు.

Read Also : Divya Bharathi : డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ ట్వీట్

Exit mobile version