కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా బలవంతంగా హీరోయిన్లు చేయాల్సి వస్తుంది. దానికి ఎన్నో రకాల కారణాలు అయితే ఉంటాయి. పెద్ద డైరెక్టర్ అని అవ్వచ్చు లేదా పెద్ద హీరో అని కూడా కారణం అయి ఉండవచ్చు.సినిమా చేయను అంటే కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు అస్సలు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుంది.ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే తెలిపారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ అయిన ప్రియాంక చోప్రా కూడా అలాంటి బోల్డ్ స్టేట్మెంటే ను చేసిందని తెలుస్తుంది.. అయితే సినిమా పేరు ఏంటన్నది మాత్రం ఆమె అస్సలు చెప్పలేదు కానీ.. ఆ సినిమా అనుభవం మాత్రం అస్సలు బాగోలేదు అని, ఆ సినిమా చేస్తుంటే నాకు అసహ్యం పుట్టేదని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది.
తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.ఆ సినిమా పేరు మాత్రం నేను బయటకు చెప్పను. కానీ ఆ సినిమా అనుభవం మాత్రం నాకు నచ్చలేదు.. సెట్స్ లో నేను గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ కూడా ఎంతో చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. సెట్స్ లో నేను ఓ బొమ్మలా కూర్చునేదాన్ని, నిజానికి నాది అలాంటి క్యారెక్టర్ కాదు.. అందుకే ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటన్నది మాత్రం ప్రియాంక చెప్పలేదు.ప్రస్తుతం ప్రియాంక వరుసగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను పొందింది.. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా ను కూడా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా ను చేస్తుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్నట్లు సమాచారం.