Prithviraj Sukumaran: సలార్ కోసం.. వరద మొట్టమొదటిసారి ఆ పనిచేశాడంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా కూడా.. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇక సలార్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవా అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. వరద రాజమన్నన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు.. ఎలా బద్ద శత్రువులుగా మారారు అనేది సలార్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా రెండు పార్ట్స్ గా రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. సలార్ కు డబ్బింగ్ చెప్పడం పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మొట్టమొదటి సారి ఐదు భాషల్లో తానే స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపాడు. ” సలార్ .. ఫైనల్ డబ్బింగ్ కరెక్షన్స్ పూర్తయ్యాయి. నేను సంవత్సరాల తరబడి పనిచేసిన వివిధ భాషల్లోని నా పాత్రలన్నింటికీ నా స్వంత గాత్రాన్ని అందించే అదృష్టం నాకు దక్కింది. నా పాత్రలకు పలు భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పాను. అయితే ఒకే క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో 5 భాషల్లో డబ్బింగ్ చెప్పడం నాకు ఇదే మొదటిసారి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళం లో సలార్ కోసం నేను డబ్బింగ్ చెప్పాను. డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దేవా మరియు వరద మిమ్మల్ని కలుస్తారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Also Read
#Salaar Final dubbing corrections done. I have had the privilege of lending my own voice for all my characters across various languages I’ve worked in over the years. I have even dubbed for some of my characters in multiple languages. But to be dubbing for the same character, in… pic.twitter.com/RmMZZ9EF72
— Prithviraj Sukumaran (@PrithviOfficial) December 10, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!