భాషతో సంబంధం లేకుండా అనేక రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న ‘విలాయత్ బుద్ధా’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్, తన కెరీర్, అభిమానులు, విమర్శల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. అభిమానులపై ప్రేమను వ్యక్తం చేసిన ఆయన.. “నేడు నేను ఉన్న స్థానం పూర్తిగా ప్రేక్షకుల వల్లే. వాళ్ల ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. అదే సమయంలో నాకు విమర్శలు చేసే హక్కు కూడా ప్రేక్షకులదే. నేను తప్పు చేస్తే వారు చెప్పాలి, నేను గౌరవంగా వినాలి. వారి సూచనలు–సలహాలే నా విజయాలకు కారణం” అన్నారు.
Also Read : Sonakshi Sinha : మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది
ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB29 ప్రాజెక్ట్‌లో కూడా పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేసే ‘కుంభ’ పాత్ర లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాక ఇటీవల రాజమౌళి పృథ్వీరాజ్‌ను ప్రశంసించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంపై స్పందించిన ఆయన “రాజమౌళి గారు నా గురించి చెప్పిన ప్రతి మాట నాకు పెద్ద గౌరవం. అలాంటి లెజెండరీ దర్శకుడి నుంచి ప్రశంసలు రావడం చాలా అరుదు” అని అన్నారు. అయితే తన పాత్ర గురించి మరింత సమాచారం మాత్రం “సమయం వచ్చినప్పుడు చెబుతాను” అని క్లారిటీ ఇచ్చారు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనున్న భారీ ఈవెంట్ #GlobeTrotter – SSMB29 కు కూడా పృథ్వీరాజ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ‘కుంభ’ పాత్రపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.