Site icon NTV Telugu

Producers : నిన్న అరవింద్.. నేడు దిల్ రాజు.. తర్వాత ఎవరు..?

Producers

Producers

Producers : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్‌ ప్రెస్ నోట్ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. థియేటర్లు మూసివేత అంశంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్‌ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను మూసేయడానికే థియేటర్లు మూసేయడానికి ప్రయత్నించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారంటూ ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. థియేటర్ల మూసివేత ఉండదనే ప్రకటన వచ్చిన తర్వాతనే.. పవన్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రావడం సంచలనం రేపింది.

Read Also : Virgin Boys: కాక రేపేలా ‘పెదవుల తడి’ సాంగ్!

వెంటనే అల్లు అరవింద్ బయటకు వచ్చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కు మద్దతు పలికారు. తాను ఆ నలుగురిలో లేనని.. తనను లాగొద్దని కోరాడు. భే షరతుగా పవన్ కే సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీ తీరునే తప్పుబట్టాడు. 24 గంటల గడవక ముందే దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టేశాడు. అసలు పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని తేల్చేశాడు. అంతా క్లియర్ అయిందని.. ఎవరి సినిమాను ఆపేయట్లేదని వివరణ ఇచ్చుకున్నాడు. ఇలా బడా నిర్మాతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి ఆ నలుగురిలో తాము లేమంటూ వివరణ ఇచ్చుకుంటున్నారు.

చూస్తుంటే మరింత మంది పెద్ద నిర్మాతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ నలుగురు అంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న పెద్ద నిర్మాతల్లో ఒకరు ప్రెస్ మీట్ పెట్టాలా వద్దా అనే ఆలోచనలు చేస్తున్నారంట. అరవింద్, దిల్ రాజు ఏం మాట్లాడారో.. ఆయన కూడా అదే మాట్లాడేందుకు రెడీ అవుతున్నాడంట. నిందలు చెరిపేసుకోవడానికే ఈ ప్రయత్నాలు అంటూ ప్రచారం కూడా మొదలైంది. పవన్ నుంచి ఒక్క ప్రెస్ నోట్ వస్తే.. పెద్ద తలలు బయటకొచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితులు నడుస్తున్నాయి.

Read Also :Naveen Polishetty : సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’

Exit mobile version