Producers : నిన్న అరవింద్.. నేడు దిల్ రాజు.. తర్వాత ఎవరు..?
- పవన్ ప్రెస్ నోట్ ప్రకంపనలు
- అయోమయంలో ఇండస్ట్రీ
- నిర్మాతలు ఒక్కొక్కరుగా బయటకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producers : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. థియేటర్లు మూసివేత అంశంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను మూసేయడానికే థియేటర్లు మూసేయడానికి ప్రయత్నించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారంటూ ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. థియేటర్ల మూసివేత ఉండదనే ప్రకటన వచ్చిన తర్వాతనే.. పవన్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రావడం సంచలనం రేపింది.
Read Also : Virgin Boys: కాక రేపేలా ‘పెదవుల తడి’ సాంగ్!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
వెంటనే అల్లు అరవింద్ బయటకు వచ్చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కు మద్దతు పలికారు. తాను ఆ నలుగురిలో లేనని.. తనను లాగొద్దని కోరాడు. భే షరతుగా పవన్ కే సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీ తీరునే తప్పుబట్టాడు. 24 గంటల గడవక ముందే దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టేశాడు. అసలు పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని తేల్చేశాడు. అంతా క్లియర్ అయిందని.. ఎవరి సినిమాను ఆపేయట్లేదని వివరణ ఇచ్చుకున్నాడు. ఇలా బడా నిర్మాతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి ఆ నలుగురిలో తాము లేమంటూ వివరణ ఇచ్చుకుంటున్నారు.
చూస్తుంటే మరింత మంది పెద్ద నిర్మాతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ నలుగురు అంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న పెద్ద నిర్మాతల్లో ఒకరు ప్రెస్ మీట్ పెట్టాలా వద్దా అనే ఆలోచనలు చేస్తున్నారంట. అరవింద్, దిల్ రాజు ఏం మాట్లాడారో.. ఆయన కూడా అదే మాట్లాడేందుకు రెడీ అవుతున్నాడంట. నిందలు చెరిపేసుకోవడానికే ఈ ప్రయత్నాలు అంటూ ప్రచారం కూడా మొదలైంది. పవన్ నుంచి ఒక్క ప్రెస్ నోట్ వస్తే.. పెద్ద తలలు బయటకొచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితులు నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!