Preity Zinta: AI డీప్‌ఫేక్‌లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta: సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కోర్టుల తలుపు తడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా చేరారు. తన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏఐ ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తనను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆమె కోర్టుకు వివరించారు. అలాంటి వాటిని తక్షణమే తొలగించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ను అప్లోడ్ చేయకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రీతి జింటా దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టులో జస్టిస్ మాధవ్ జామ్దార్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని సంబంధిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. గత కొంతకాలంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ కారణంగా పలువురు ప్రముఖులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జాకీ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు కూడా అశ్లీల ఫేక్ కంటెంట్ తొలగించమని ఇదివరకే కోర్టులను ఆశ్రయించారు. అలాగే రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్ వంటి నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగంపై కఠిన నియంత్రణ అవసరమనే అభిప్రాయం అయితే బలపడుతోంది.
Also Read
- Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
- National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
- July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
- Tollywood : అక్టోబర్‌లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, ప్రీతి జింటా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. సన్నీ డియోల్‌తో కలిసి నటించిన ‘బంత్వారా’ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, మరోవైపు డిజిటల్ ప్రపంచంలో డీప్‌ఫేక్ వీడియోల కోసం న్యాయపోరాటం ప్రారంభించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.
- Tags
- cinema
- Preity Zinta
తాజావార్తలు
-
Preity Zinta: AI డీప్‌ఫేక్‌లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!