Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేవలం అందాల ఆరబోత, అబ్బురపరిచే అభినయంతోనే కాదు.. ఫైట్స్‌తో కూడా ఫ్యాన్డమ్ సంపాదించవచ్చు అని ప్రూవ్ చేసింది ‘బ్లాస్ట్’ భామ ‘ప్రీతి ముకుందన్’. అవును, ‘కన్నప్ప’ సినిమా వచ్చినప్పుడు తెలుగులో ఈ అమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ వేరు.. ఇప్పుడు ‘బ్లాస్ట్’ సక్సెస్ తరువాత ఏర్పడిన ఫాలోయింగ్ వేరు. దీంతో ఈ కోలీవుడ్ కోమలికి సోషల్ మీడియాలో విపరీతంగా తెలుగు ఫాలోయర్స్ పెరగడమే కాదు, ఏకంగా తెలుగులో మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ ప్రాజెక్ట్స్‌లో సైతం ఈమెను హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్‌కు సిఫార్సులు కూడా చేస్తున్నారు.
ఈ మేరకు ఇటీవల ఓ నెటిజన్ ఈ ‘బ్లాస్ట్’ హీరోయిన్ను ‘OG 2’ లో తీసుకోండి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నిజానికి ఈ హీరోయిన్‌కు పాన్ ఇండియా ఫిల్మ్స్‌లో ఛాన్సెస్ రాకముందు, హీరోయిన్గా మొదటి ఫిల్మ్ మన తెలుగులోనే హీరో ‘శ్రీవిష్ణు’ కి జతగా ‘ఓం భీమ్ బుష్’ మూవీలో చేసింది. అయితే, ‘ప్రీతి’కి ఫస్ట్ మూవీలో హీరోయిన్గా రాని క్రేజ్.. అదే టైములో తమిళ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ‘సాయి అభ్యంకర్’ తో చేసిన ‘ఆసా కూడా’ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తెచ్చిపెట్టింది. ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అప్పట్లో భాషతో సంబంధం లేకుండా సౌత్ రీజియన్స్ అన్నిటినీ రీల్స్‌తో చుట్టేసింది. దీంతో ఓవర్‌నైట్‌లో ఈ హీరోయిన్ పేరు మారుమోగిపోయింది.
అలా ఆమెకు బాలీవుడ్ యాక్ట్రెస్ ‘నుపుర్ సనన్’ వదులుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ లో హీరోయిన్ రోల్ రావడంతో పాటు, ‘ప్రభాస్’ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా ఆమెకు కమర్షియల్ గా సక్సెస్ ఇవ్వకపోయినా, ఆ లోటును ఇప్పుడు తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్‌తో చేసిన ‘బ్లాస్ట్’ భర్తీ చేసేసింది. నిజానికి, తమిళ హీరో ‘విజయ్’ ఎమ్మెల్యేగా గెలిచిన ‘తిరుచిరాపల్లి’ జిల్లాలో పుట్టిన ఈ బుట్టబొమ్మ.. అక్కడే ‘NIT-ట్రిచీ’ లో BTech ECE చదివింది. వృత్తిపరంగా డాక్టర్ అయిన తన తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది.
అలా మొదట్లో యాడ్స్, ఆ తరువాత ‘ముత్తు ముత్తు’ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌తో తొలిసారి స్క్రీన్ మీద కనిపించింది. ఈ ఆల్బమ్ సాంగ్ కూడా విపరీతంగా సక్సెస్ కావడంతో ‘స్టార్’ అనే తమిళ్ మూవీలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఈ తమిళ బ్యూటీకి కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు, మలయాళం ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ దక్కింది. తెలుగు ఓటిటి ప్రేక్షకులు మెచ్చిన సర్వం మాయ చిత్రంలో కూడా ‘ప్రీతి’ యాక్ట్ చేసింది. ఈ చిత్రం అక్కడ మలయాళంలో కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇలా వరుస హిట్స్, విలక్షణమైన పాత్రల ఎంపికతో ఈ అరవ అందం తెలుగు స్టార్ హీరోల సరసన చేరేందుకు రూట్ సిద్ధం చేసుకుంటోంది.
Also Read
- Ramayana : లాస్ ఏంజెల్స్‌లో 'రామాయణ' ట్రైలర్ లాంచ్
- Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
- Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా 'మా ఇంటి బంగారం'
- God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్‌ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!