ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్ .. ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా ఆ డైరెక్టర్ నామ జపం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రంలో యష్ నటన, ఆహార్యం అల్టిమేట్ గా తీర్చిదిద్దాడు ప్రశాంత్ నీల్.. అయితే సినిమాను బాగా పరిశీలిస్తే సినిమాలో నటించిన ప్రధాన పాత్రలన్నింటికీ గడ్డం ఉంటుంది. హీరోతో పాటు విలన్ గా కనిపించిన ప్రతి ఒక్కరు రూత్ లెస్ గ్యాంగ్ స్టార్స్ గా కనిపించారు. ఈ సినిమా రెండు పార్ట్ లలోను హీరో, విలన్ అలా కనిపించడం వెనుక పెద్ద కథ ఉందని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్.. కొంతమంది మీద ఉన్న కోపంతోనే తాను ఆ పాత్రలను అలా డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ తన సినిమాలో ప్రతి ఒక్కరికి గడ్డం ఎందుకు పెట్టాడో చెప్పుకొచ్చాడు. ” నేను ‘ఉగ్రం’ చేసేటప్పుడు క్లీన్ షేవ్ తో ఉన్నాను. అప్పుడు ఒకడు న దగ్గరకు వచ్చి ఈ సినిమా డైరెక్టర్ ఎవరు..? అని నన్నే అడిగాడు.. మూవీ రిలీజ్ అయ్యాకా కూడా నువ్వేనా డైరెక్టర్ అని అడిగేవారు. నాకు చాలా కోపం వచ్చేది.. ఆ కోపంతోనే కెజిఎఫ్ సినిమాలో ప్రతి ఒక్కరికి గడ్డం పెట్టించాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రశాంత్ నీల్ బాగా హర్ట్ అయ్యినట్లు ఉన్నాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.