Mythri Movie Makers : బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. యంగ్ టాలెంట్స్‌తో రూపొందుతున్న ఈ కొత్త హర్రర్ మూవీని కీర్తన్ నాదగౌడ డైరెక్ట్ చేస్తోంది. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ ప్రారంభాన్ని సెలబ్రేట్ చేసింది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్‌లో జరిగే భయానక సంఘటనల చుట్టూ కథ తిరుగనుందని తెలుస్తోంది. సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకాల నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు అనుభవించబోతున్నామని చెబుతున్నారు.
Read Also : I-Bomma: ఐ-బొమ్మ వెబ్‌సైట్ నుంచి కీలక సందేశం విడుదల !
సీక్రెట్‌పై నడిచే ఈ కథ ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త హర్రర్ అనుభూతిని ఇవ్వనుందని చెబుతున్నారు. ఈ మూవీలో శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వెంకీ G.G సంగీతం అందిస్తున్నారు. మోహన్ B.S డైలాగ్స్ రాస్తున్నారు. అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని యూనిట్ వెల్లడించింది. కొత్త తరహా హర్రర్ కథ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సర్ ప్రైజ్ రానుందని చెబుతున్నారు.
Read Also : Balakrishna : ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలకృష్ణకి సన్మానం