Prasanth Varma: ప్రశాంత్ వర్మ .. సంక్రాంతి నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. హనుమాన్ లాంటి సినిమాకు దర్శకత్వం వహించి.. అభిమానులను తన వర్క్ కు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా నుంచి ప్రశాంత్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఇక హనుమాన్ సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా మారాడు. చిన్న సినిమాను తన విజువల్స్ తో, టేకింగ్ తో పెద్ద పెద్ద స్టార్ మేకర్స్ సైతం ముక్కున వేలేసుకొనేలా చేశాడు. ఇక ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్ ను చిత్ర బృందం సెలబ్రేట్ కూడా చేసుకున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్నాడు. నిత్యం ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యనే హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా విదేశాలకు వెళ్లిన ప్రశాంత్ వర్మ అక్కడ మంచి మంచి లొకేషన్స్ లో అద్భుతమైన ఫోటోషూట్ చేసి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక కర్లీ హెయిర్, స్టైల్.. ప్రశాంత్ వర్మ హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనిపించేలా ఉన్నాడు. దీంతో అభిమానులందరూ.. అచ్చు హీరోలా ఉన్నావ్.. నీ యూనివర్స్ లో నువ్వే చేయన్నా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ అధీరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతో ప్రశాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.