Prakash Raj: ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్ చివరికి కామెడీ కూడా పండించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ఇక 2019 లో ఈ సినిమా మొదలయ్యింది. ఇప్పటివరకు కనీసం ఒక్క టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేసింది లేదు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ డబ్బింగ్ మొదలుపెట్టాడని తెలుపును మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రెండేళ్ల క్రితమే సినిమా మొదలుపెడితే ఇప్పటివరకు ప్రకాష్ ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు అనే అనుమానాలు వస్తున్నవేళ ఒక పుకారు బయటికి వచ్చింది.
అదేంటంటే.. కృష్ణవంశీకి ప్రకాష్ రాజ్ కు మధ్య పారితోషికం విబేధాలు నడుస్తున్నాయట.. అందుకే ఆయన డబ్బింగ్ చెప్పడానికి లేట్ అయ్యిందని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్ భారీగానే రెమ్యూనిరేషన్ అడిగాడట. దీంతో కృష్ణవంశీ సగం డబ్బు షూటింగ్ కు ముందు చెల్లించేసి.. మరో సగాన్ని డబ్బింగ్ చెప్పిన తరువాత చెల్లిస్తానని చెప్పాడట.. అదనుకు ససేమిరా అన్న ప్రకాష్ రాజ్ మొత్తం డబ్బు చెల్లిస్తే తప్ప డబ్బింగ్ చెప్పనని మంకు పట్టు పట్టుకొని కూర్చున్నాడట. దీంతో కృష్ణవంశీ చేసేది లేక మొత్తం డబ్బు చెల్లించేవరకు డబ్బింగ్ ను వాయిదా వేస్తూ వచ్చాడట.. అందుకే ఇంత లేట్ అయ్యిందని చెప్పుకొస్తున్నారు. కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మరి అయినా ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ విషయంలో ఇలా చేయడం భావ్యం కాదే అని కొందరు అంటుండగా సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో ఎవరికి తెలుసు.. అందుకే ముందు జాగ్రత్తగా తన డబ్బులు తాను అడుగుతున్నాడు అందులో తప్పేముంది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.