ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది… మా ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, అధ్యక్షుడిగా బరిలోకి దిగి ఓటమిపాలైన తర్వాత.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్.. ఇవాళ తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, మరోవైపు.. ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు కూగా గుప్పుమన్నాయి… ‘మా’కు పోటీగా ATMAA (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) ‘ఆత్మ’ పేరుతో కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని.. దానిపైనే చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరిగింది.. అయితే, మీడియా సమావేశంలో దానిపై క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్..
అసలు, కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు ప్రకాష్ రాజు.. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అంటూ ప్రచారం చేస్తున్నారు.. కానీ, తాము ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ లాంటివి పెట్టడానికి బయటకు రావడం లేదని.. అసలు ఆ ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. ఓడినా.. గెలిచినా.. ప్రశ్నిస్తూనే ఉంటాం… ప్రతీ నెలా నా డార్లింగ్ విష్ణును చేశావా? లేదా? అంటూ అడుగుతూనే ఉంటానని.. ప్రతీ నెలా రిపోర్ట్ కార్డ్ అడుగుతూనే ఉంటానన్న ప్రకాష్‌రాజ్.. అక్కడ ఉంటే 11 మందిమే ప్రశ్నించడానికి ఉంటాం.. కానీ, బయటకి వస్తే వంద మందిమి ప్రశ్నిస్తామని సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు.. మంచి ప్రతిపక్షంగా ఉంటాం.. మీకు సహకారం అందిస్తాం.. కానీ, పనిచేయకపోతే ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నారు.. మా అసోసియేషన్‌లోని సమస్యలపై స్పందించడానికే వచ్చాం తప్ప.. మేమేదో పది మందితో కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనే లేదన్నారు ప్రకాష్ రాజ్. రాజీనామాలు అనేది చాలా నొప్పి కలిగించే విషయం.. కానీ, మా మంచి కోసమే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.