Prakash Dantuluri: ఎక్కువ చెబితే కిక్ పోతుంది.. కథను ఇబ్బంది పెట్టకూడదు: ఏవమ్ దర్శకుడి ఇంటర్వ్యూ
- చాందిని చౌదరి-వశిష్ట సింహా-భరత్‌రాజ్-ఆషు రెడ్డి కీలక పాత్రలలో యేవమ్
- ఈ చిత్రానికి నిర్మాతలుగా నవదీప్- పవన్ గోపరాజు
- మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Dantuluri Interview for Yevam Movie: చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి కీలక పాత్రలలో యేవమ్ సినిమా వస్తోంది. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాల్లోకి వెళితే
మీ నేపథ్యం?
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నా కెరీర్ ప్రారంభమైంది. ఓ టైమ్‌లో హిందీలో లగాన్, తెలుగులో ఖుషి సినిమాలు నన్ను దర్శకుడిగా మారడానికి ప్రేరణ ఇచ్చాయి. అందుకే యూఎస్‌లో రిజైన్ చేసి ఇండియాకు వచ్చాను. ఆ సమయంలో
నేను రాసుకున్న ఓ కథ ప్రియాంక దత్ గారికి వినిపించాను. అశ్వనీదత్ గారు కూడా కథ విని నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చారు. నా తొలిసినిమా వైజయంతీ మూవీస్‌లో ఓంశాంతి సినిమా చేశాను. ఈ సినిమా తరువాత నా బిజినెస్‌ల్లో బిజీగా అవ్వడం వల్ల చాలా గ్యాప్ తీసుకున్నాను. కోవిడ్ గ్యాప్‌లో మళ్లీ సినిమా చేయాలని అనిపించింది. అనుకోకుండా నవదీప్‌ను కలవడం ఆసమయంలోనే సీస్పెస్ పెట్టడం, ఆ టైమ్‌లో కలుసుకున్నాను. నవదీప్‌కు కాన్సెప్టు నచ్చి ఈ సినిమాకు నిర్మాతగా మారాడు.
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
యేవమ్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
యేవమ్ అనేది సంస్కత పదం, ఇతిహాసాలు, పురాణాలు చెప్పినప్పుడు ఇది ఇలా జరిగింది అని చెప్పడాన్నియేవమ్ అంటారు. ఈ సినిమాలోని పాత్రలు రియల్‌లైఫ్ పాత్రల్లా వుంటాయి. నలుగురు విభిన్నమైన వ్యక్తుల కథ ఇది. వంశీ అన్వేషణ లాంటి థ్రిల్లర్‌ను మనకు తెలిసిన పాత్రలతో చెబితే ఎలా వుంటుంది అనేది యేవమ్.
ఎవరికి తెలియని ఈ టైటిల్ పెట్టడం రిస్క్ అనిపించలేదా?
ఈ టైటిల్ అర్థం ఎవరికి తెలియనిది అని తెలుసు. కానీ కథకు ఇదే యాప్ట్ టైటిల్. ఒక్కసారి సినిమా చూసిన తరువాత ఈ టైటిల్ గురించి అర్థం అవుతుంది. టైటిల్ గురించి ఇంత డిస్కషన్ జరగడం కూడా మాకు ప్లసే అవుతుంది.
యేవమ్ పోలీసాఫీసర్ కథ అనుకోవచ్చా?
పోలీసాఫీసర్ కథ అయినా చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ ఇది. పత్రి పాత్ర కూడా ఎంతో యూనిక్‌గా వుంటుంది. సినిమా మొత్తం సీరియస్ మూడ్‌లో వుండదు. ప్రతి సన్నివేశాన్నిఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమా కథకు మూలం ఏమిటి?
నేటి సమాజంలోని వ్యక్తులను చూసి రాసుకున్న పాత్రలే ఇవి. ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలను చేదించడానికి వాళ్లు పడే స్ట్రగుల్ ఈ కథ. అయితే చిత్రంలో ఓ అమ్మాయి తను అనుకున్న గోల్‌ను ఎలా చేరుకుంది? అనేది ఎంతో ఆస్తకికరంగా ఎంటర్టైనింగ్గా వుంటుంది. సమాజంలోని పాత్రలు, నా మైండ్‌లో రిజిస్టర్ అయిన పాత్రల్లోంచి వచ్చిందే యేవమ్
సినిమాలోని పాత్రల గురించి?
ఈ సినిమాలో పాత్రల గురించి చెబితే కథ తెలిసిపోతుంది. అందుకే పూర్తిగా చెప్పలేం. కానీ క్యారెక్టర్స్‌ను ఒక పోస్టర్ ద్వారా వాళ్ల పాత్రలను తెలియజేశాం. ఇంతకంటే ఎక్కువ చెబితే క్యారెక్టర్‌లోని కిక్ పోతుంది.
చాందిని చౌదరి పాత్ర ఎలా వుంటుంది?
చాందిని చౌదరి సౌమ్య పాత్రలో లీనమైపోయింది. ప్రతి సన్నివేశం బాగా చేసింది. ఆమెకు నటిగా మంచి పేరును తీసుకవస్తుంది.
ఈ సినిమాకు నేపథ్యం సంగీతం ఎంత వరకు ప్లస్ అవుతుంది?
నేపథ్య సంగీతం కథను చెప్పాలి. కథను ఇబ్బంది పెట్టకూడదు. ఈ సినిమాకు ఫీమేల్ సంగీత దర్శకురాలు నేపథ్య సంగీతం అందించింది. చాలా బాగా చెసింది. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్ చెబుతుంది.
ఈ సినిమాను థియేటర్లోనే ఎందుకు చూడాలి?
ఈ సినిమా మేమే థియేటర్ కోసం చేసింది. టెక్నికల్‌గా కూడా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం తీశాం. ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా.సినిమాను థియేటర్లో చూసిన ఫీల్ ఓటీటీలో రాదు. థియేటిక్రల్ ఎక్స్పీరియన్స్ బెటర్ దెన్ ఓటీటీ.
తాజావార్తలు
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!