టాలీవుడ్ సినీ ప్రియులకు ఒక విలక్షణమైన కాంబినేషన్ సెట్ అయింది. ‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రదీప్ రంగనాథన్హీ రోగా.. టాలీవుడ్ ఇంటెలిజెంట్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది.
ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రదీప్ రంగనాథన్.. ఈ సినిమాతో ఫుల్ లెంగ్త్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చేయబోతున్నారు. చంద్రశేఖర్ యేలేటి మార్క్ మైండ్ గేమ్‌లు, విభిన్నమైన స్క్రీన్‌ప్లేకు.. ప్రదీప్ రంగనాథన్ మార్క్ యూత్‌ఫుల్ ఎనర్జీ మరియు కామెడీ తోడైతే థియేటర్లలో విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడానికే మెగా క్రేజీగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.
“ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు.” మరిన్ని వివరాలు, నటీనటుల లిస్ట్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

