Pradeep Ranghnadhan: లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన కుర్ర డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే లో హీరోగా కూడా నటించి మెప్పించిన ప్రదీప్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న ప్రదీప్ కోలీవుడ్ లో మొదటి సినిమానే స్టార్ హీరో జయం రవితో కోమాలి ని తెరకెక్కించాడు. జయం రవి సరసన ఈ సినిమాలో కాజల్ నటించి మెప్పించింది. కోమాలితో మొదటి సినిమానే హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమా విజయం సాధించడంతో కోమాలి నిర్మాతలు, ప్రదీప్ కు కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారట. అయితే ప్రదీప్ మాత్రం కారును వెనక్కి తిరిగి ఇచ్చేసి తనకు కారు వద్దని, ఆ కారు ఎంత రేటు ఉంటుందో అంత డబ్బు ఇవ్వండి అని కోరాడట. అలా అడగడం ఎందుకు అంటే.. ఆ సమయంలో తనకు కారు మెయింటైన్ చేసే స్తోమత లేదని, కారు ఉనన పెట్రోల్ కు డబ్బులు లేవు అని చెప్పాడట. దీంతో సదురు నిర్మాతలు ఆ కారు డబ్బులను అతనికి ఇచ్చినట్లు, ఆ డబ్బుతోనే లవ్ టుడే సినిమాను తీసినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీకి తన కళను నెరవేర్చుకోవడానికే కానీ కాస్ట్లీ కారులు, ఆడంబరాలు చూపించుకోవడానికే కాదు అని కుర్ర డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.