Prabuthwa Junior Kalashala to Release on June 21: ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో ఓ యదార్థ సంఘటన ఆధారంగా చేసుకొని ఒక సినిమాని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. బ్లాక్ యాంట్ పిక్చర్స్ అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శ్రీ మతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదల చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Mamitha: పాపం… మమితా బైజుకి చేదు అనుభవం.. పాపని ఏం చేద్దామనుకున్నార్రా? అసలు!
ఈ ట్రైలర్ చూస్తే.. టీనేజ్ లో అడుగుపెట్టిన వాసు (ప్రణవ్ ప్రీతం) స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. కాలేజ్ లో అడుగుపెట్టగానే అందమైన అమ్మాయి కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ముందు కుమారిని చూస్తేనే భయంతో వాసుకు మాటలు రాకున్నా వాసు, కుమారి స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా దగ్గరవుతారు. ఇంతగా ప్రేమించిన వాసుతో మాట్లాడటం ఆపేస్తుంది కుమారి. వాసు ఎంత ప్రయత్నించినా కుమారి మనసు మారదు. వాసుకు కుమారి ఎందుకు దూరంగా ఉండాలనుకుంది ?. ఈ జంట తిరిగి ప్రేమలో ఒక్కటయ్యారా ? లేదా ? అనే అంశాలతో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది.