Prabhuthwa Junior Kalashala : మా ఊరుకు నా వంతుగా ఒక గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్ర రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆ రోజు మా జీవితాల్లో ఒక బిగ్ డే అనుకోవాలి. ఎన్నో ఇబ్బందులు దాటి మా సినిమాను రిలీజ్ వరకు తీసుకురావడమే పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. యువత, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ట్రైలర్ లో మీరు సినిమా క్వాలిటీ ఎంత బాగుందో చూశారు. మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు కొన్ని నెలల టైమ్ కేటాయించాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాం.
డబ్బింగ్ కోసమే 8 నెలల టైమ్ వెచ్చించాం. దీన్ని బట్టి మేము మూవీ క్వాలిటీ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో అర్థం చేసుకోండి. సినిమా మీద ప్యాషన్ తో ఇదంతా చేశాం. మనం ఉన్నా లేకున్నా సినిమా మాత్రం ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఆ సినిమా బాగుండాలి. నేను పుట్టి పెరిగింది చదివింది పుంగనూరులో. మా ఊరు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి మా ఊరి పేరును టైటిల్ లో పెట్టి మా ఊరిలోనే సినిమా చిత్రీకరించాం. అలా మా ఊరుకు నా వంతుగా ఒక గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉంది. నేను ఒక పెద్ద ప్రొడక్షన్ లో సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు. అప్పుడు సొంతంగా నేనే సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా దగ్గర కెమెరా రెంట్ తీసుకునేందుకు కూడా డబ్బులు లేవు. అలాంటి టైమ్ లో దేవుడి ఫొటో దగ్గర 5డీ కెమెరా పెట్టి మా అమ్మను పిలిచి పూజ చేయమని చెప్పా. డబ్బులు లేవు కదా అని అమ్మ అనలేదు.
Also Read
- Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
- Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
- Rao Bahadur: 'నేను ఎప్పుడూ సహజీవనం చేస్తుంటాను'.. ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాటల తూటాలు!
- God of War: ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
నువ్వు సినిమా చేయగలవు అని ధైర్యం చెప్పి పూజ జరిపింది. నన్ను నమ్మిన మా పేరెంట్స్ కు ముందుగా థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఈ ప్రయాణంలో నన్ను నిస్వార్థంగా నమ్మి హెల్ప్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, ఇతర మిత్రులకు థ్యాంక్స్. డబ్బు కోసం ఈ సినిమా చేయలేదు. డబ్బు కావాలంటే ఎన్నో పనులు ఉన్నాయి. కానీ నాకు సినిమా అంటే ఇష్టం. కానీ చాలా మందికి సినిమా అంటే వ్యాపారం. అలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇవన్నీ దాటుకుని ఈ నెల 21న గ్రాండ్ గా మా మూవీ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆర్టిస్టుల పరంగా మాది చిన్న సినిమానే కానీ క్వాలిటీ పరంగా కాదు. విజయ్ యేసుదాస్, చిన్మయి లాంటి వాళ్లతో పాటలు పాడించాం. మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా చూశాక మీరు మీ పేరెంట్స్ ను గుర్తు తెచ్చుకుంటారు. అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Sanju Samson-Gambhir: సంజు అసంతృప్తి.. గంభీర్ సర్దిచెప్పే ప్రయత్నం.. సోషల్ మీడియాలో రచ్చ!
-
Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!