కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే భాషతో సంబంధం లేకుండా తన డ్యాన్స్ యాక్టింగ్ తో స్పెషల్ ఇయెజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్‌షోలో అతిథిగా హాజరైన ఆయన తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Also Read : Niharika Konidela : విడాకుల తర్వాత ఫ్యామిలీకి దూరంగా.. క్లారిటి ఇచ్చిన నిహారిక !
‘హిప్‌హాప్, బ్రేక్ డ్యాన్స్ ఇవేవి నాకు తెలియదు. నాకు తెలిసిందల నా స్టైల్ డ్యాన్స్ మాత్రమే. అదే ప్రేక్షకులకు అందిస్తున్నా. మా వంశంలో చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు. కానీ నా కొడుకు రిషి మొదట ఈ రంగంలో ఆసక్తి చూపలేదు. కానీ రెండు సంవత్సరాల క్రితం సడన్‌గా ‘నేను యాక్టర్ అవుతాను’ అన్నాడు. అప్పటి వరకు పిల్లాడిలా ఉండే అతను ఇలా చెప్పడంతో షాక్ అయ్యాను. ఈ రంగంలో నిలబడటం కష్టం. కాబట్టి ముందుగా చదువు పూర్తి చేయమని చెప్పా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం పొందమని సలహా ఇచ్చాను’ అని తెలిపారు.
అలాగే.. ‘‘ ఇండస్ట్రీలో నాకు చిరంజీవి ఆదర్శం. ఎందుకంటే ఆయన కష్టపడే తీరు చూసి నేను చాలా నేర్చుకున్నాను. ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’ సినిమాలో మెరుపులా పాటకు నేను కొరియోగ్రఫీ చేశా. ఆయన డ్యాన్స్ మూమెంట్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను.. నాకు ఈరోజు ఇంత గుర్తింపు రావడానికి చిరంజీవే కారణం. ఎందుకంటే టాలెంట్ ఉంటే ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాల్లో ‘అబ్బనీ తీయని దెబ్బ..’ పాటకు మా నాన్నతో పాటు నేను కొరియోగ్రఫీలో భాగమయ్యాను. అప్పటికి నా వయసు 15 ఏళ్లు. స్టెప్స్ నేర్చుకోవడం, నా పని చేసుకోవడమే తెలిసేది’’ అని ప్రభుదేవా స్మరించుకున్నారు. ప్రభుదేవా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు చిరంజీవి–ప్రభుదేవా బాండింగ్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.