రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యాడు. సలార్ సీజ్ ఫైర్, కల్కి, మారుతితో చేస్తున్న సినిమాలని ప్రభాస్ ఏడాది గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి ప్రభాస్ బాక్సాఫీస్ పై చేయబోయే దండయాత్ర మొదలవనుంది. ఇంతకన్నా ముందే ప్రభాస్ సినిమా ఒకటి ప్రేక్షకులని పలకరించనుంది. ప్రభాస్-వినాయక్ కాంబినేషన్ లో 2007లో వచ్చిన సినిమా యోగి. ఈ యాక్షన్ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా మెయిన్ హైలైట్ గా ఉంటుంది. ఫన్, సూపర్బ్ సాంగ్స్ ఉన్న యోగి సినిమా క్లైమాక్స్ కారణంగా ఫ్లాప్ అయ్యింది. క్లైమాక్స్ ని కాస్త మార్చి ఉంటే యోగి సినిమా ప్రభాస్ కి ఛత్రపతి రేంజ్ మూవీ అయ్యేది. ఫ్లాప్ అనే విషయం పక్కన పెడితే, ఈ మూవీలో ప్రభాస్ ని వినాయక్ సూపర్బ్ గా చూపించాడు. మాస్ హీరోకి అవసరమైన ప్రాపర్ ఇంట్రడక్షన్, సాలిడ్ ఫైట్స్, విజిల్స్ వేయించే డైలాగ్స్ తో ప్రభాస్ ని వినాయక్ మస్త్ ప్రెజెంట్ చేసాడు.
ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రభాస్ హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందుకే రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కి యోగి సినిమా చాలా స్పెషల్. టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ మంచి స్వింగ్ లో నడుస్తోంది. మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి నటించిన హిట్ సినిమాలని రీరిలీజ్ చేసుకుంటూ ఫ్యాన్స్ థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఈ రీరిలీజ్ సినిమాల కలెక్షన్స్ కూడా పీక్ స్టేజ్ లో ఉంటున్నాయి. అయితే ఇప్పటివరకూ రీరిలీజ్ అయిన సినిమాలు దాదాపు హిట్ అయినవే. ఒక్క ఆరెంజ్ సినిమా మాత్రమే ఫ్లాప్ అయినా, రీరిలీజ్ లో సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రభాస్ కి సంబంధించినంత వరకూ ఇప్పటివరకు రీరిలీజ్ అయినవి ఫ్లాప్ సినిమాలే. ఇదే లిస్టులో ఇప్పుడు యోగి కూడా కలుస్తుంది. ఫ్లాప్ సినిమాతో రీరిలీజ్ బుకింగ్స్ లో కూడా ప్రభాస్ తన రేంజ్ ఎంతో చూపిస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ రాబడుతున్నాడు. మరి ఈ సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని రీరిలీజ్ లో అయినా ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.