రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యాడు. సలార్ సీజ్ ఫైర్, కల్కి, మారుతితో చేస్తున్న సినిమాలని ప్రభాస్ ఏడాది గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి ప్రభాస్ బాక్సాఫీస్ పై చేయబోయే దండయాత్ర మొదలవనుంది. ఇంతకన్నా ముందే ప్రభాస్ సినిమా ఒకటి ప్రేక్షకులని పలకరించనుంది. ప్రభాస్-వినాయక్ కాంబినేషన్ లో 2007లో వచ్చిన సినిమా యోగి. ఈ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో పి.రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘యోగి’. ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించింది. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘జోగి’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 2007 జనవరి 14న విడుదలైన ‘యోగి’ మాస్ ను ఆకట్టుకుంది. ‘యోగి’ కథ ఏమిటంటే- కన్నతల్లి అతిగారాబంతో ఈశ్వర చంద్రప్రసాద్ ఏ పనీపాటా చేయడు. తండ్ర మూర్తి చివరి కోరిక ఈశ్వర్ ప్రయోజకుడు కావాలన్నది. దాంతో పట్నంలో ఉన్న…