యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భారతీయ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి “ప్రాజెక్ట్ కే” అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో ప్రభాస్, అమితాబ్ పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రభాస్ తో కలిసి పని చేసిన ఎవరైనా రాజుల విందు, సౌత్ వంటకాల టేస్ట్ చూడకుండా వెళ్లలేరు. ప్రభాస్ ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమైన వంటకాలను, ఆ విందును ఆస్వాదించిన ప్రముఖులు దాని గురించి కథలుకథలుగా చెప్తారు. అయితే ప్రస్తుతం అమితాబ్ వంతు వచ్చింది.
Read Also : RIP Goutham Reddy : సినీ ప్రముఖుల సంతాపం
సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న అమితాబ్ ను ప్రభాస్ ఎప్పటిలాగే తమ ఇంట్లో వండిన ప్రత్యేకమైన వంటకాలతో రుచికరమైన ట్రీట్ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమితాబ్ సరదాగా ప్రభాస్ పై, ఆయన విందుపై పంచులు వేయడం ఆసక్తికరంగా మారింది. ‘బాహుబలి’ ప్రభాస్ మీ దాతృత్వం అతీతమైనది. మీరు నాకు ఇంట్లో వండిన రుచికరమైన ఆహారాన్ని తీసుకువచ్చారు. ఆ విందును ఒక ఆర్మీకి తినిపించవచ్చు. కుకీలు ప్రత్యేకం” అంటూనే “మీ అభినందనలు జీర్ణించుకోలేనివి” అంటూ చమత్కరించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన దీపికా పదుకొనె కూడా ప్రభాస్ ఇచ్చిన ట్రీట్ ను రుచి చూసిన విషయం తెలిసిందే.
T 4198 – 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army ..
— Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022
the special cookies .. beyond scrumptious ..
And your compliments beyond digestible 🤣