Prabhas : ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయన రాజా సాబ్ సినిమాను మూడేళ్ల క్రితమే ప్రారంభించారు, అయితే అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని రోజులపాటు ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే, ఆ సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, మరోపక్క ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు, ప్రస్తుతానికి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో పని చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయింది.
Read Also : World Liver Day 2025: స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవల ప్రారంభం
ఈ నేపథ్యంలో, ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ మోకాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు విశ్రాంతి అవసరం కావడంతో, ఆయన ఇటలీలోని ఒక పల్లెటూరికి వెళ్లినట్లు సమాచారం. అది ప్రభాస్ డ్రీమ్ డెస్టినేషన్ అని అంటున్నారు. ఆ పల్లెటూరిలో సుమారు మూడు నాలుగు వారాలపాటు ప్రభాస్ విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత, ఆయన మళ్లీ వచ్చి హను రాఘవపూడి సినిమా షూటింగ్లో చేరబోతున్నారు. ఇక రాజా సాబ్ షూటింగ్లో కూడా ఆయన కొంత భాగం పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఆయన ప్రత్యేకమైన డేట్స్ కేటాయించాల్సి ఉంది.