Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇందులో ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సందీప్ తన సినిమాలతో బోల్డ్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఎలాంటి బోల్డ్ పాత్రల్లో హీరోలను చూపించాడో మనం చూశాం. ఇప్పుడు ప్రభాస్ ను కూడా అలాగే చూపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.
Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్ కు రూ.200 కోట్లు.. ఏంట్రా ఇది..
మొన్న ప్రభాస్ బర్త్ డే రోజు రిలీజ్ చేసిన వీడియోలో ప్రకాశ్ రాజ్ ది ఓ డైలాగ్ ఉంటుంది. ఖైదీని బట్టలూడదీసి చెక్ చేసి పంపించండి అంటాడు. దీన్ని బట్టి ప్రభాస్ పాత్ర ఓ సీన్ లో బట్టల్లేకుండానే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అత్యంత బోల్డ్ అండ్ మాసివ్ లుక్ లో కనిపించబోతున్నాడంట. ప్రభాస్ ను ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో ఆయన ఫ్యాన్స్ చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా చూస్తే ఫ్యాన్స్ తట్టుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also : Bigg Boss 9 : దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్.. మొత్తం తెలుసంటూ..