The Raja Saab Trailer : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందుకు తగ్గట్టే ఉంది. ఇందులో ప్రభాస్ ను రెండు పాత్రల్లో చూపిస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read Also : Dhana Sri : చాహల్ మోసం చేశాడు.. ధనశ్రీ షాకింగ్ కామెంట్స్
కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ హర్రర్ క్రైమ్ సినిమాలో నటిస్తున్నాడు. పైగా ఇందులో ఆయన సీనియర్ పాత్రపై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అందుకు తగ్గట్టే ఉంది. ఇందులో విజువల్స్, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ స్టైల్, లుక్, దెయ్యం కొంపలో చేసే విన్యాసాలు.. వీఎఫ్ ఎక్స్ అదుర్స్ అన్నట్టే ఉన్నాయి.
Read Also : OG : ఇన్నాళ్లకు పవన్ ఫ్యాన్స్ కల తీర్చేసిన సుజీత్..