‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా.. ఈరోజు ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
Also Read: Nara Bhuvaneswari: బాబు బిజీ.. నారా లోకేష్ పెంపకం బాధ్యత నేనే తీసుకున్నా!
రాజాసాబ్ ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం (నవంబర్ 21) మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అలానే రెబల్ సాబ్‌కు సంబందించిన స్టైల్, స్వాగ్, ఎంట్రీ లెవల్ కూడా రివీల్ చేస్తున్నట్లు పేర్కొంది. అంటే రాజాసాబ్ నుంచి మరో పోస్టర్ లేదా వీడియో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన రెబల్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. ఎందుకంటే కొన్ని రోజులుగా రాజాసాబ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందించారు. ఇటీవల తమన్ వరుస హిట్స్ కొడుతుండడంతో పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
It’s #RebelSaab 🔥
STYLE.⁰SWAG.⁰ENTRY LEVEL.
Catch the “STYLE” tomorrow at 12 PM along with the “FIRST SINGLE” date 📸 #Prabhas #TheRajaSaab #TheRajaSaabArrivesIn50Days pic.twitter.com/KLPV2SWmA1
— The RajaSaab (@rajasaabmovie) November 20, 2025