Prabhas: 50 రోజుల్లో రికార్డులని చెల్లాచెదురు చేయడానికి ‘డైనోసర్’ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తూ.. మోస్ట్ వయోలెంట్ మాన్ అంటూ హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘సలార్ రెండు పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది… మొదటి పార్ట్ పేరు సీజ్ ఫైర్” అంటూ చిన్న టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కి ఇండియాలో డిజిటల్ రికార్డ్ మిగలేదు. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమా రేంజ్ ఏంటో నిరూపించింది ఈ టీజర్. సలార్ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. వీలైనంత త్వరగా సలార్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసి… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు.
ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించిన ప్రభాస్… సెప్టెంబర్ 28న రాక్షసుడిగా రాబోతున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి… కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యగల సత్తా ఉన్న సలార్ మూవీ.. సరిగ్గా మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 50 రోజుల్లో బాక్సాఫీస్ బద్దలవబోతోంది… అంటూ సోషల్ మీడియాలో సలార్‌ను ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే ఈ మంత్ ఎండింగ్ లో సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీజర్ ని మించి హైప్ సాంగ్ క్రియేట్ చేస్తే సలార్ బాక్సాఫీస్ ఊచకోత నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యరెంటీ. ఏదేమైనా.. యాభై రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర సలార్ అనే భారీ తుఫాన్ రాబోతోందని చెప్పొచ్చు.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!