సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ రణబీర్ కపూర్ కార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘A’ సర్టిఫికెట్ తో… మూడున్నర గంటల నిడివితో డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఒక A రేటెడ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఇండియాలో ఇదే మొదటిసారి. సినిమా నచ్చితే A సర్టిఫికెట్ కూడా సినిమాని ఏమీ చెయ్యలేవు అని నిరూపిస్తుంది అనిమల్ సినిమా. అయితే పది రోజుల్లోనే 700 కోట్లు రాబట్టిన అనిమల్ కలెక్షన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే అసలైన A రేటెడ్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా రూపొందిన సలార్ సినిమాకి సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చింది.
ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడంతో A సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివితో సలార్ బాక్సాఫీస్ పై దండయాత్రకి సిద్ధమయ్యింది. అనిమల్ మూవీకి సౌత్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, నార్త్ లో సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. సలార్ సినిమాకి అలా కాదు నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో సలార్ ర్యాంపేజ్ ఉంటుంది. ఓపెనింగ్స్ నుంచి ఫస్ట్ వీక్, ఫస్ట్ మండే… ఇలా ప్రతి చోట కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయనుంది సలార్ సినిమా. అనిమల్ క్లోజింగ్ కలెక్షన్స్ దగ్గర నుంచి సలార్ ఓపెనింగ్ కలెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఫైనల్ కలెక్షన్స్ విషయంలో ఇండియాలో A రేటెడ్ సినిమాలకే కాదు U/A సినిమాలకి కూడా సలార్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందేమో చూడాలి.