ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ ని డైనోసర్ తో పోలుస్తూ బాక్సాఫీస్ లెక్కల వేట గురించి ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే ప్రిడిక్షన్స్ స్టార్ట్ చేసాయి. రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నాయి కాబట్టి సలార్ సీజ్ ఫైర్ ప్రమోషన్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టీజర్ తో ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు విధ్వంసానికి శాంపిల్ ని చూపించేసారు. ఇక ట్రైలర్ తో ఎలాంటి రికార్డ్స్ ని సృష్టిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో సలార్ ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే సలార్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సలార్ ట్రైలర్ సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ లో ఫ్యాన్స్ వెయిటింగ్ కి సెప్టెంబర్ 7నే ఎండ్ కార్డ్ పడనుంది. ఆ రోజు సోషల్ మీడియాని రెబల్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ సీజ్ చేయనున్నారనే చెప్పాలి. టీజర్ లో ప్రభాస్ ఫేస్ రివీల్ చేయని ప్రశాంత్ నీల్ ట్రైలర్ ప్రభాస్ తో ఒక్క డైలాగ్ చెప్పించినా కూడా డిజిటల్ రికార్డుల పునాదులు చెల్లాచెదురు అవ్వడం ఖాయం. ఇక పాటల విషయానికి వస్తే సలార్ సినిమాలో ఒకటే మెయిన్ సాంగ్ ఉంటుందట. అలాగే రెండు మూడు బిట్ సాంగ్స్ ఉంటాయట, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో మాత్రమే వస్తాయట. దీంతో ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు సలార్ నుంచి సాంగ్స్ బయటికొచ్చే ఛాన్స్ లేదని సమాచారం. అందుకే డైరెక్ట్‌గా సలార్ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్.