Salaar: 90 సెకండ్స్ టీజర్ లాక్… రికార్డ్స్ అన్నీ బ్రేక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ అవైటేడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రభాస్ నటిస్తున్న సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తమ హీరో కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్‌ను ఇప్పటి నుంచే ఊహించుకుంటు, ప్రభాస్ ఫాన్స్ బాక్సాఫీస్ లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సలార్ టీజర్ టైం ఫిక్స్ అయిందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూలై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్ బయటకి రానుందని అంటున్నారు. జూలై 7న టీజర్ టైం ఫిక్స్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటికే సలార్ టీజర్ రన్ టైం కూడా లాక్ అయినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక నిమిషం 30 సెకన్లుగా ఈ టీజర్‌ను సాలిడ్‌గా కట్ చేశారట. ఈ 90 సెకన్ల టీజర్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో, గూస్ బంప్స్ వచ్చేలా ప్రభాస్‌ను మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్.
యూనివర్సల్ లెవల్లో రానున్న ఈ టీజర్.. వెయ్యి కోట్ల విధ్వంసానికి నాంది అని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఒక్కసారి ఈ టీజర్ బయటికొస్తే.. సలార్ లెక్కలన్నీ మారిపోనున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో పడబోయే వెయ్యి కోట్ల బొమ్మ ఇదేనని ఫిక్స్ అయిపోయాయి. ఇదిలా ఉండగానే.. ఓవర్సీస్‌లో సలార్‌కి మాసివ్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారు. సలార్ చిత్రానికి మాసివ్ రిలీజ్ ఉంటుంది, కింగ్ వస్తున్నప్పుడు కింగ్ సైజ్ రిలీజే ఉంటుంది ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సలార్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఏదేమైనా.. సలార్ టీజర్ దెబ్బకు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం గ్యారెంటీ.
Also Read
- Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన 'మైకెల్' రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్
- Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
- Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. 'పెద్ది'కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
- Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
తాజావార్తలు
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!