Prabhas: థియేటర్స్ అన్నీ డైనోసర్ ఇస్తే… కింగ్ ఖాన్ పరిస్థితి ఏంటో?
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి తన కంబ్యాక్ ని హిస్టారికల్ మూమెంట్ గా మార్చేసాడు. బాలీవుడ్ క్రైసిస్ ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో ప్రాణం పోసిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక స్టార్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం ఇదే మొదటిసారి. రేర్ ఫీట్ ని క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్… డిసెంబర్ నెలలో డుంకి సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. రాజ్ కుమార్ హిరణీతో కింగ్ ఖాన్ చేస్తున్న డుంకి సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న డుంకి సినిమాతో షారుఖ్ ఖాన్ మరో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అనే అంచనాలలో ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి.
షారుఖ్ డుంకి సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ప్రభాస్ సలార్ సినిమాతో స్పీడ్ బ్రేకర్ లా మారాడు. సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో ప్రభాస్ vs షారుఖ్ ఖాన్ ఆన్ అయ్యింది. క్లాష్ ఆఫ్ టైటాన్స్ రేంజులో పేరు తెచ్చుకున్న ప్రభాస్-షారుఖ్ బాక్సాఫీస్ వార్ రోజురోజుకీ హీట్ పెంచుతూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ vs షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వెర్బల్ వార్ కి దిగుతున్నారు. అయితే షారుఖ్ ఖాన్ డుంకి సినిమాతో హిట్ కొడతాడో లేదో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం సాలిడ్ హిట్ కొట్టడం గ్యారెంటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ కి ఎక్కువ నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతున్నాయి. డుంకి సినిమాకి థియేటర్స్ కి సలార్ భారి కోత పెట్టడం పక్కా. ఈ విషయం అర్ధం చేసుకోని డుంకి టీం వెనక్కి తగ్గుతారా లేక మొండిగా డైనోసర్ కి ఎదురేల్తారా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!