బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో సలార్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. నైజాంలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ రీజన్‌లో అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ విషయంలో ఆర్ఆర్ఆర్ లెక్షన్స్‌ని బ్రేక్ చేస్తూ.. 12 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్. ఇక మొత్తంగా నైజాం మార్కెట్‌లో దుమ్ముదులిపేసింది.
Read Also: Bahubali Salaar: ఆ కటౌట్ కత్తి పడితే రిజల్ట్ ఈ రేంజులోనే ఉంటుంది…
నైజాం ఏరియాలో మొదటి రోజు 22.55 కోట్ల షేర్‌ని రాబట్టింది సలార్. గ్రాస్ పరంగా 32 కోట్లు కొల్లగొట్టినట్టుగా చెబుతున్నారు. దీంతో నైజాంలో సలార్ నాన్ RRR రికార్డుని సెట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నైజాంలో 23.35 కోట్ల షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నెంబర్‌తో సలార్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ అండ్ మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని చూస్తే ప్రభాస్ సోలోగానే వచ్చి అద్భుతం చేసి చూపించాడనే చెప్పాలి. సలార్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వీకెండ్ వరకు మరిన్ని రికార్డులు సెట్ చేయడం పక్కా. మొత్తంగా.. సలార్ సినిమా 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలబడం గ్యారెంటీ. మరి సలార్ ఫైనల్ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.