ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు. అయితే.. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.
Also Read : RAPO 22 : ‘ఉపేంద్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్
కానీ ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ మారుతి మాత్రం సమ్మర్‌లో అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మే నెల మిడ్‌లో అప్డేట్స్ ఇస్తామని ఆ మధ్య హింట్ ఇచ్చాడు మారుతి. అందుకు తగ్గట్టే టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు మారుతి. సాలిడ్ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయి. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే తనతో డబ్బింగ్ పూర్తి చేసేందుకు ఎదురుచూస్తున్న మారుతికి ఆ టైమ్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఇక డార్లింగ్ డబ్బింగ్ చెప్పడమే ఆలస్యం. టీజర్ ను ఎప్పుడైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.