SKN : ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగటివ్ ట్రెండ్ చేశాడని, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే నిర్మాత పాజిటివ్ ట్రెండ్ చేస్తాడని చెప్పాడు.
Read Also : Kannappa Vs Kubera : కన్నప్ప వర్సెస్ కుబేర.. ఏ ట్రైలర్ బాగుందంటే..?
అయితే ఆ నెగటివ్ ట్రెండ్ చేసిన నిర్మాత ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ముందు డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డివీవీ దానయ్య నిర్మించాల్సి ఉంది. అనౌన్స్‌మెంట్ టైంలో ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత మారుతీ చేసిన పక్కా కమర్షియల్ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డివీవీ దానయ్య ఈ సినిమా చేయలేనని చేతులెత్తేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. అలా ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాగా ది రాజా సాబ్ రూపొందుతోంది. ఈ నేపథ్యంలోనే ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ నిర్మాత ఎవరు? ఒకవేళ డివీవీ దానయ్య ఏనా ? అనే చర్చ జరుగుతోంది. కానీ డివీవీ దానయ్య నెగటివ్ ట్రెండ్ చేయించిన దాఖలాలు అయితే అధికారికంగా లేవు కాబట్టి స్వయంగా ఆయనే చెబితే కానీ ఆ నిర్మాత ఎవరు అనేది చెప్పలేం.
