Prabhas: ‘సలార్’ సెట్స్‌లో ప్రభాస్..ఫొటో లీక్..మీరు కూడా ఓ లుక్ వేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ కి బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. తాజాగా వచ్చిన రాధే శ్యామ్ కూడా నిరాశపరచడంతో అటు డార్లింగ్ ప్రభాస్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టేలా ‘సలార్’ ని సిద్ధం చేసుకుంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. అయితే సలార్ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా వర్రీ అవుతున్నారని, వెయిట్ తగ్గితే తప్ప లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనని ఖరాఖండీగా చెప్పారని, ప్రభాస్‌కు వెయిట్ తగ్గమని కండిషన్లు పెట్టారని సదరు వార్త సారాంశం. అటువంటి వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు.
సలార్ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. సెట్స్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ప్రభాస్ కౌగిలించుకున్న ఫొటోను సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. సలార్ షూటింగ్ 30- 35 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నట్టు… ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. బర్త్ డేకి ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. KGF 2ను నిర్మించినది కూడా ఆయనే. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘సలార్’ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు KGF2 50 డేస్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ పాల్గొన్నారు.
https://www.instagram.com/p/CeXr3fsvUqk/?utm_source=ig_web_copy_link
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!