Prabhas : ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. ఆమెతో పెళ్లి.. ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా ఉంది. తప్పకుండా జరుగుతుంది. ఆ శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి అవుతుంది అంటూ చెప్పారు శ్యామలా దేవి.
Read Also : WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది నిజమేనా..?
ఆమె గతంలోనూ కొన్ని సార్లు ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందని చెప్పింది. కానీ ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఏజ్ 45 ఏళ్లు. పెళ్లి జరిగితే ఈ రెండేళ్లలోపే కావాలి. 50 ఏళ్లు పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవడమ గగనమే అవుతుంది. మరి ప్రభాస్ నిజంగానే ఓ ఇంటివాడు అవుతాడా లేదా సింగిల్ గానే ఉండిపోతాడా అన్నది త్వరలోనే తెలిసిపోనుంది. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు రెబల్ స్టార్. త్వరలోనే స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ కాబోతోంది. ఇంకోవైపు సలార్-2, కల్కి-2లు కూడా షూట్ కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రభాస్ నుంచి ది రాజాసాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన నటించిన బాహుబలి మూవీ అక్టోబర్ లో రీ రిలీజ్ అవుతోంది.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్..
