Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సలార్… పస్తుతం ప్రభాస్ చేస్తున్న భారి బడ్జట్ సినిమాలు. హ్యుజ్ సెటప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మధ్యలో అందరికీ షాక్ ఇస్తూ ప్రభాస్ దర్శకుడు మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వ్యతిరేఖత ఉంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఇచ్చిన మాటని, కమిట్ అయిన సినిమాని వదిలి వెళ్లకుండా ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు నలబై రోజుల రోజుల షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. మారుతీ స్టైల్ లో కామెడీ టచ్ ఇస్తూ ఉండే హారర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకూ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు.
మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఇంకా ఫిక్స్ చెయ్యలేదు కానీ రాజా డీలక్స్ పాజిటివ్ వైబ్ నే తెచ్చింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మేకర్స్ ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో 19వ శతాబ్దపు కాలం నాటి ‘స్పెషల్ హౌజ్ సెట్’ వేశారని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మొదలైన కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో విదేశీ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్, పలువురు నటీనటులు పాల్గొనబోతున్నారట. దాదాపు పది రోజుల పాటు ఇదే లొకేషన్ లో చిత్ర యూనిట్ ‘హౌజ్, టెర్రస్, ఇంటీరియర్స్’ షూటింగ్ చెయ్యనున్నారు. మరి అందరి అంచనాలని తలకిందులు చేస్తూ మారుతీ, ప్రభాస్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తాడేమో చూడాలి.
Also Read
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
- Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!