బాహుబలి సినిమాతో రీజనల్ బౌండరీస్ చెరిపేసి పాన్ ఇండియా అనే కొత్త పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు ప్రభాస్. ఈ రెబల్ స్టార్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఫేస్ అఫ్ ఇండియన్ సినిమా సినిమాగా ఎదిగాడు. ఖాన్స్, కపూర్స్ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని ప్రభాస్ అన్ డిస్ప్యూటెడ్ కింగ్ గా నిలిచాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ని తన ప్రైమ్ టైమ్ లో బీట్ చేస్తున్న ప్రభాస్ ఎలాంటి పోటీ లేకుండా యునానిమస్ గా కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గా నిలిచాడు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ప్రభాస్ మార్కెట్ ని, కలెక్షన్స్ ని రీచ్ అవ్వడానికి మన హీరోలు చాలానే కష్టపడాల్సి వచ్చేలా ఉంది. సలార్ సినిమా కేవలం నార్త్ అమెరికాలో ప్రీమియర్స్, డే 1 కంప్లీట్ అయ్యే సరికి దాదాపు 5 మిలియన్ డాలర్స్ లో కలెక్ట్ చేసింది.
ఇతర హీరోల నార్త్ అమెరికా క్లోజింగ్ కలెక్షన్స్ కూడా ఈ స్థాయిలో లేవు. ప్రభాస్ 5 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు… సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా బీట్ చేసి ఇప్పటివరకు ప్రభాస్ మూడు సార్లు నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్స్ ని రాబట్టాడు. ప్రభాస్ తర్వాత రజినీకాంత్ రెండు సార్లు 5మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసాడు. యష్, దళపతి విజయ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒక్కొక్కసారి 5 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యారు. మిగిలిన సౌత్ హీరోలు ప్రభాస్ రికార్డ్స్ కి దరిదాపుల్లో కూడా లేరు. నెక్స్ట్ కల్కి, సందీప్ రెడ్డి వంగ సినిమాలతో ప్రభాస్ నార్త్ అమెరికాలో మరిన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.