Site icon NTV Telugu

KGF 2: యష్ కోసం రంగంలోకి ప్రభాస్..?

kgf 2

kgf 2

ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్లను మొదలుపెట్టడానికి చూస్తున్నారట.

ఇక ఈ ప్రమోషనల్లో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్ పూజా కార్యక్రమాలకు యష్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ కారణంగానే ప్రభాస్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే బావుటుందని మేకర్స్ చెప్పడంతో సరే అన్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదే కాకుండా నిజమైతే ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే వేదికపై సందడి చేయనున్నట్లే. దీంతో ఈ వార్త వినగానే అభిమానులు ఆరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version