Site icon NTV Telugu

Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా !

Spirit

Spirit

Spirit : నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఈవెంట్‌కు వచ్చాడు. ముహూర్తం షాట్ కూడా కొట్టాడు.

Read Also : Brahmanandam : తప్పుగా అర్థం చేసుకున్నారు.. కాంట్రవర్సీపై బ్రహ్మానందం క్లారిటీ

కానీ ఫోటోలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీని వెనక ఉన్న కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్ణయం. ప్రభాస్ కొత్త లుక్‌ను ఇప్పుడే బయటపెట్టాలనే ఉద్దేశ్యం సందీప్ కు లేదు. అందుకే ఫొటోలు రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. సందీప్ వంగా సినిమాల్లో హీరో లుక్ అన్నది ప్రత్యేక హైలైట్‌గా ఉంటుందని తెలిసిందే. అదే స్టైల్‌ను స్పిరిట్ కోసం కూడా పాటిస్తున్నాడు. అభిమానుల్లో అంచనాలు పెరిగేలా, కొత్త లుక్‌ను గ్రాండ్‌గా బయటపెట్టేందుకే ఇప్పుడు బయట పెట్టలేదని తెలుస్తోంది.

Read Also : iBomma Ravi : 15 రోజులకో టూర్.. లగ్జరీ లైఫ్‌.. రవి లైఫ్ స్టైల్ ఇదే

Exit mobile version