Prabhas : ప్రభాస్ గురించి ఇప్పటికే ఎంతో మంచి చెబుతున్నారు. ఆయన మనసున్న మహారాజు అని. బయటకు పెద్దగా కనిపించడు. ఎవరితోనూ కలవడు. ఎలాంటి ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ కు రాడు. కానీ తాను చేయాల్సింది మాత్రం సైలెంట్ గా చేసేస్తాడు. అదే ప్రభాస్ అంటే. తాజాగా ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడని ఓ డిస్ట్రిబ్యూటీర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అది కూడా తమిళ డిస్ట్రిబ్యూటర్. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమాలు కొన్ని వసూళ్ల వర్షం కురిపిస్తే.. ఇంకొన్ని నష్టాలు మిగిల్చాయి. తాజాగా ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ రూ.50 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చేశాడని చెబుతున్నాడు.
Read Also : Prabhas : ప్రభాస్ మరో హిస్టరీ క్రియేట్ చేస్తాడా..?
‘ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ ప్లాప్ అయింది. ఆ సినిమా కోసం హీరో రూ.100 కోట్లు తీసుకున్నాడు. కానీ మూవీ ఆడకపోవడం వల్ల తన రెమ్యునరేషన్ లో రూ.50 కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చి.. వాటిని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పంచమని చెప్పాడు. అది ఆయన మంచితనం అంటూ తెలిపాడు సదరు డిస్ట్రిబ్యూటర్. ఇప్పటి వరకు ఈ విషయం బయటకు తెలియదు. కానీ డిస్ట్రిబ్యూటర్ మాటలతో ఈ విషయం కాస్త చర్చనీయాంశం అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ను తెగ పొగిడేస్తున్నారు. ఎంతైనా రాజు రాజే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నష్టాలు వస్తే కనీసం పట్టించుకోని హీరోలున్న ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచించడం గొప్ప విషయం అంటున్నారు నెటిజన్లు. ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పింది నిజమో కాదో తెలియదు గానీ.. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
Read Also : Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎవరికీ తలొంచడు.. బ్రహ్మానందం కామెంట్స్