పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడూ ఏదో ఒక స్పెషాలిటీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సహజంగా తిండి ప్రియుడు అయిన ప్రభాస్ తనతో పని చేసే తారలకు ఎప్పటికప్పుడు అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తుంటాడు. ఆయనతో పని చేసే స్టార్స్ అంతా షూటింగ్ ఉన్నన్ని రోజులూ ‘వివాహ భోజనంబు’ అన్నట్టుగా కడుపు నిండా సంతృప్తిగా భోజనం చేస్తారు. ఇక మన ప్రభాస్ కు మరో అలవాటు కూడా ఉంది. అదేంటంటే… గిఫ్ట్స్ ఇవ్వడం. తాజాగా ఆయన తన చిత్రబృందానికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. తన తొలి బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను పూర్తి చేసిన బాహుబలి ఇప్పుడు మూవీ సభ్యులకు ఖరీదైన రాడో వాచ్ లను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ టీంకు వాచ్‌లను బహుమతిగా ఇస్తున్న ఫోటోను ఆయన టీమ్ మెంబర్‌లలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : “పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
కాగా ప్రభాస్ ప్రస్తుతం దీపికా పదుకొనేతో కలిసి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లో ఉన్నాడు . మేకర్స్ దాని మొదటి షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తి చేసినట్లు దీపిక తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రభాస్ ‘సలార్’ చిత్రీకరణలో కూడా బిజీగా ఉన్నాడు. ఇక “రాధే శ్యామ్”ను 2022 జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.