Prabhas :’ఫౌజీ’ 70% షూటింగ్ పూర్తి.. ఆ 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఫౌజీ’ (Fauji) గురించి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. యుద్ధ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. తాజా షెడ్యూల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల పాటు సాగుతుందని, ఇది ప్రేక్షకులకు గూజ్ బంప్స్ మూమెంట్స్ ఇస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పోరాట ఘట్టం కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో అత్యంత కీలకమైన మలుపుగా ఉండబోతోంది. ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు హను రాఘవపూడి స్టైల్ ఎమోషన్స్ ఈ సీక్వెన్స్‌లో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan: శిరీష్ పెళ్ళికి పవన్’కు ఆహ్వానం
Also Read
ఈ షెడ్యూల్ కేవలం యాక్షన్‌కు మాత్రమే కాకుండా, వెండితెర దిగ్గజాల కలయికకు కూడా వేదికైంది. ఇందులో ప్రభాస్‌తో పాటు జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ నటులు కూడా పాల్గొన్నారు: సీనియర్ నటి జయప్రద ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. చాలారోజుల తర్వాత ఆమె ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి కూడా ఈ షెడ్యూల్లో పాలుపంచుకున్నారు. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన బలమని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 70 శాతం షూటింగ్ పూర్తవడంతో, మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనున్నారు. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం మీద రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ ‘ఫౌజీ’ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
-
Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
-
Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?