NTV Telugu Site icon

Spirit: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ కొత్త సినిమా

Spirit

Spirit

ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, డైరెక్టర్ మారుతీ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన ప్రభాస్ 2023లో మూడు సినిమాలని ఆడియన్స్ ముందుకి తెస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ఈ పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. అయితే ఒక సినిమా మాత్రం పేలడానికి సిద్ధంగా ఉన్న లాండ్ మైన్ లా చాలా సైలెంట్ గా ఉంది. ప్రభాస్ ని పోలిస్ గా ప్రెజెంట్ చెయ్యబోయే ఆ సినిమా పేరు ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిపొయింది. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ 2023 చివరికి పూర్తవ్వనున్నాయి, ఆ లోపు సందీప్ రెడ్డి వంగ కూడా రణబీర్ కపూర్ తో చేస్తున్న ‘అనిమల్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. ఇద్దరూ ఫ్రీ అవ్వగానే ‘స్పిరిట్’ సినిమా 2023 ఎండ్ లో కానీ 2024 స్టార్టింగ్ లో కానీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read Also: Prabhas Photo Leaked : ప్రభాస్ కొత్త సినిమా రాజా డీలక్స్ ఫోటో లీక్.. వైరల్

అనౌన్స్మెంట్ తప్ప అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేని ఈ మూవీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #SPIRIT ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వడానికి కారణం ఈరోజు సందీప్ రెడ్డి వంగ పుట్టిన రోజు కావడమే. “విషింగ్ ఏస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఏ స్ప్లెండిడ్ బర్త్ డే అండ్ ఎ ఇయర్ ఫుల్ ఆఫ్ హ్యాపినెస్ అండ్ సక్సస్” అంటూ సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగకి ప్రభాస్ బర్త్ డే విశేష్ చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫాన్స్ అంతా అసెంబుల్ అయ్యి ట్విట్టర్ లో సందీప్ రెడ్డి వంగకి విశేష్ చెప్తూ… ప్రభాస్ ని పోలిస్ గా సూపర్బ్ గా ప్రెజెంట్ చెయ్యమని అడుగుతున్నారు. ప్రభాస్ అభిమానుల ఈ కోరికకి “డిజప్పాయింట్ చెయ్యను” అంటూ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ సమాధానం చెప్పాడు. మరి ఈ మోస్ట్ యాంటిసిపెటేడ్ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
Read Also: Prabhas: ఇది కదా అసలైన మాస్ కటౌట్…