తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా కలిసి ‘ఫ్యాన్స్ క్రికెట్ లీగ్’ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 1 ఇటీవలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ లాంటి స్టార్ హీరోల అభిమానులు ఈ లీగ్ లో ఆడారు. గత రాత్రి ప్రభాస్ ఫ్యాన్స్ ‘రోరింగ్ రెబల్స్’ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘హంగ్రీ చీతాస్’ మధ్య ఫైనల్స్ గ్రాండ్ గా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హంగ్రీ చీతాస్ ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసారు. రోరింగ్ రెబల్స్ కి 158 పరుగుల టార్గెట్ ని ఛేజ్ చేయడానికి రంగంలోకి దిగిన రోరింగ్ రెబల్స్… ఛేజింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడి టార్గెట్ ని ఛేజ్ చేసారు.
Read Also: Kannappa: ప్రభాస్ షెడ్యూల్ ఇప్పుడే కాదు… టైమ్ ఉంది మిత్రమా
మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిన రోరింగ్ రెబల్స్… ఫ్యాన్స్ క్రికెట్ లీజ్ సీజన్ 1 ట్రోఫీ ప్రభాస్ ఫ్యాన్స్ గెలుచుకున్నారు. ఈ కారణంగా సోషల్ మీడియాలో రోరింగ్ రెబల్స్, ప్రభాస్ ట్యాగ్స్ టాప్ ట్రెండ్ అవుతున్నాయి. ఫైనల్స్ లో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచిన హంగ్రీ చీతాస్ టీమ్… తమకి వచ్చిన ప్రైజ్ మనీని జనసేన పార్టీ ఫండ్ కి ఇచ్చారు. ఈ ఫైనల్స్ చూడడానికి అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో టీమ్ కూడా రావడం విశేషం. మరి ఇన్ని రోజులుగా అభిమానులని ఎంటర్టైన్ చేసిన ఫ్యాన్స్ క్రికెట్ లీజ్ సెకండ్ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.
Read Also: NTR: టైగర్ కోసం మాంత్రికుడి సోషియో ఫాంటసీ…